యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో
ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. వరుస అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు.తాజాగా హీరో ప్రభాస్
ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. ‘ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అద్భుతమైన అనుభూతి’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు వైభవీ మర్చంట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.షూటింగ్ అప్‌డేట్స్‌ను తెలియజేస్తూ చిత్ర నిర్మాణం సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాతో మురళీ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాప్, చుంకీ పాండే, మందిరా బేడీ, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.