వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కూడా కరువైంది..!

మహిళా ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై టీడీపీ నేత నారా లోకేశ్ వైసీపీ రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కూడా కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జగన్ కు అంత కక్ష దేనికో అర్థం కావడం లేదని అన్నారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలను తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్పుడు మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితిని తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోందని అన్నారు.

Tags:kotamreddynara lokeshycp party

Leave a Response