బుధవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు , వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మరియు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఖమ్మం జిల్లా ఏన్కూరులో 9.3, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.5, వెంకటాపురం మండలం అలుబాక 7.3, మహబూబ్‌నగర్‌లోని హన్వాడలో 7, జగిత్యాల జిల్లా ఇనుగుర్తిలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
- /
- /admin
- /No Comment
- /130 views
- /andhra pradeshheavy rainstelangana
తెలుగు రాష్ట్రలో భారీ వర్షాలు..!
Tags:andhra pradeshheavy rainstelangana
previous article
జీవీప్రకాష్ రెండోసారి హారర్ చిత్రంలో..
next article
ముద్దు వొద్దు అంటున్న తమన్నా..!
Related Posts
- /
- /No Comment
జులాయిగా తిరిగే వాళ్ల పై పోలీసు దృష్టి…
- /
- /No Comment