మధ్యాహ్నం 3.45 గంటకు రేణిగుంటకు ముఖ్యమంత్రి: జగన్ టూర్ షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఈ రోజు తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు తిరుపతి రేణుగుంట వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలికాక ఆయనతోపాటు రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు ఏపీ సీఎం వైస్ జగన్. ప్రధాని అక్కడ జరిగే విజయోత్సవ సభలో పాల్గొంటారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానికి వీడ్కోలు పలికిన అనంతరం విజయవాడకు ప్రయాణమవుతారు. కాగా, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన ఒకేసారి కావడంతో తిరుపతి మొత్తం పోలీసుల తో నిండిపోయింది. ఈ సందర్భం గా భారీభద్రతా ఏర్పాట్లుచేశారు. రేణిగుంట నుంచి తిరుమల వరకు మూడువేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు అని సమాచారం. రేణిగుంట నుంచి తిరుమలకు నిన్ననే పోలీస్ లు ట్రయిల్‌ రన్‌ కూడా పూర్తి చేశారు. వీరిరువురూ ప్రయాణించే మార్గాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు ఏపీ పోలీస్ లు .

Tags:Ap Cm YS Jagan Mohan Reddy Meets PM Narendar Modi at Renigunta Air port Tirumalapm modi newsPM Modi Visit tirupathirenugunta airportTTD newsys jagan visit tirumala

Leave a Response