సీఎం జగన్ డిగ్రీ మార్కుల జాబితా చూశారా!

ఏపీCM వైస్ జగన్ బాల్య మిత్రులు కొందరు ఈ మధ్య తేరా పైకి వచ్చారు. దింతో జగన్ విద్యార్హతలు ఏంటో ఇప్పుడు ప్రజలందరికి తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ విద్యార్హతలపై గతంలో అసెంబ్లీ లో కూడా చర్చ బాగానే జరిగింది. ఆయన చదువుపై ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడం మనకందరికీ తెలిసిందే. అయితే, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో గతంలో కలిసి చదువుకున్న అనేకమంది తెరపైకి వచ్చారు. దాంతో, జగన్ నిజమైన విద్యార్హతలు అందరికీ తెలిశాయి.

జగన్ విద్యాభ్యాసం దాదాపు హైదరాబాద్ లోనే సాగింది. ప్లస్ టూ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆయన, డిగ్రీ ప్రగతి మహావిద్యాలయలో పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో, జగన్ డిగ్రీ మార్కుల జాబితా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఆయన ఇంగ్లీష్, సంస్కృతం, బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, కరెన్సీ అండ్ బ్యాంకింగ్, ఇండియన్ ఎకానమీ, కంపెనీ లా ఆడిట్, కాస్ట్ అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటిస్టిక్స్ తదితర సబ్జెక్టులతో బీకాం చదివినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తమ్మీద జగన్ డిగ్రీలో మంచి మార్కులతోనే పాసైనట్టు తెలుస్తోంది.

Leave a Response