పలమనేరులో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సి.శారదా కుమార్ ఆధ్వర్యంలో పలమనేరులో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికుల సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకు రూ 18000 వేతనం పెంచడంతో పురపాలక సంఘం పరిధిలోని కార్మికులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని మున్సిపల్ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ వద్ద స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చి వైయస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు కార్మికులందరికీ స్వీట్లు పంచి పెట్టి ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో కార్మికులు పని చేసి పలమనేరు పురపాలక సంఘాన్ని రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చాచా నెహ్రూ విగ్రహాలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకు ఏమి చేసారు ?
previous article
ప్రేమలో పడ్డారా..?
next article
పెళ్లి రోజు వేడుకలో అక్కినేని కుటుంబం..
Related Posts
- /
- /No Comment