తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దసరా పండుగకు సొంతూర్లకు ఎలా చేరుకోవాలా? అని ఆలోచిస్తున్న ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం దసరా కోసం 150 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. అత్యధికంగా 110 బస్సులను హైదరాబాద్ నుంచి నడుపుతున్నట్లు ప్రకటించింది. మిగిలిన వాటిలో 30 సర్వీసులను బెంగళూరు నుంచి, మరో పది సర్వీసులను చెన్నై నుంచి నడుపుతామని ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.హైదరాబాద్ మహానగరంలో ఏపీ నుంచి వెళ్లి స్థిరపడిన వారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వాసులు ఎక్కువ మంది ఉన్నారు. సాధారణంగా వీరంతా దసరా, సంక్రాంతి పండుగకు సొంతూరుకు రావాలని ప్లాన్ చేసుకుంటారు.వారికి ఇది తీపి కబురనే చెప్పాలి.
Tags:special busestsrtc
previous article
ధైర్య సాహసాల అభినందన్ వర్దమాన్ టీమ్ మొత్తానికీ అవార్డు..!
next article
ఆయన కూతురు కవిత బతుకమ్మ ఆడితే చలా..!
Related Posts
- /
- /No Comment