టాలీవుడ్ లో హీరోహీన్స్ చాలామందే వచ్చారు వెళ్లారు. హీరోహిన్ గా టాలీవుడ్ లో నిలతోక్కున్నవాళ్ళు చాల తక్కువమంది. అలాంటిది తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న కథానాయికల్లో రష్మిక ఒకరు. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తోంది. మహేష్‌బాబు సినిమాలోనూ ఆఫర్ కొట్టేసింది. ఇక్కడి అమ్మాయి కాకపోయినా, తెలుగు నేర్చుకుని.. అచ్చమైన తెలుగు కథానాయిక గా మారిపోయింది. ఆమెకంటూ ఒక స్థానాన్ని తెలుగు ప్రజలగుండెలలో ఏర్పర్చుకుంది. ‘‘తెలుగు భాష ఇంత త్వరగా నేర్చుకుంటానని నేను అనుకోలేదు. సెట్లో ఎవరేం మాట్లాడినా శ్రద్ధగా వినేదాన్ని. నా వ్యక్తిగత సిబ్బందిని కూడా తెలుగులోనే మాట్లాడమని చెప్పేదాన్ని. చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు శ్రద్ధగా వినేదాన్ని. నాకెవరైనా ఒక్కసారి చెబితే, వందసార్లు చెప్పినట్టే. మైండ్‌లో అలా ప్రింటు గుద్దినట్టు గుర్తుండిపోతుంది. అందువల్లే తెలుగు త్వరగా నేర్చుకున్నా. దర్శకుడు ఏదైనా ఒక్కసారి చెబితే అట్టే ఫాలో అయిపోతాను. వాటిని నాదైన శైలిలో చెబుతా. సహజత్వం అంటే నాకు ఇష్టం. బయట ఎలా ఉంటానో కెమెరా ముందూ అలానే ఉండడానికి ప్రయత్నిస్తా’’ అంది రష్మిక.
next article
‘భారతీయుడు 2’పై కొత్త ఆశలు….
Related Posts
- /No Comment
అప్పుడు చంద్ర బాబు ఇప్పుడు జగన్-బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు
- /No Comment