ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ చాల రసవత్తర జరగనుంది. రెండు బలమైన జట్లు తలపడే ఈ మ్యాచ్ అభిమానులకు చాల ఆనందాయకమైనది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. బలమైన సౌతాఫ్రికాపై భారత్ ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. కాగా, ఆదివారం నాటి మ్యాచ్‌పై ఆసీస్ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్ రూపంలో ఆస్ట్రేలియాకు పెను సవాలు ఎదురుకానుందని బోర్డర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో జాగ్రత్తగా ఆడకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సొంత జట్టును హెచ్చరించాడు అలెన్ బోర్డు. టీమిండియాలోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, ఆ జట్టుతో ఆడడమంటే పెను సవాలేనని ఆయనన్నారు. అంతేకాదు, ప్రపంచకప్‌లో ఆడుతున్న అన్ని జట్లకు భారత్ గట్టి ప్రత్యర్థి మారనుందన్నాడు. భారత జట్టులో రోహిత్, కోహ్లీ, బుమ్రాలాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని ఆస్ట్రేలియాకుహెచ్చరించాడు.