బాలీవుడ్ అందాల సుందరి ప్రియాంక చోప్రా. ప్రస్తుతానికి ఈ అమ్మడు హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. రెండేళ్ల తరువాత హిందీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ది స్కై ఈజ్ పింక్’ అనే టైటిల్‌తో అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమా లో అక్తర్ కథానాయకుడిగా నభావోద్వేగపు పోస్ట్ షేర్ చేసిన ప్రియాంక చోప్రాటిస్తున్నారు. జైరా వసీమ్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో వస్తున్నట్టు బాలీవుడ్ టాక్. ఆ పాత్రలు ప్రేక్షకుల మతులు పోగొట్టేలా ఉంటాయని అంటున్నారు. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో ప్రియాంక తల్లిగా జైరా నటిస్తుంది. అక్టోబర్ 11,2019న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు.తాజాగా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో టీంతో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ లాంగ్ పోస్ట్‌లో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ఈ చిత్రం తనకి చాలా స్పెషల్ అని చెబుతూ, మూవీ తనకి ఎన్నో నేర్పించిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు చిత్ర యూనిట్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా పేర్కొంది ప్రియాంక. చాలా చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్ చెప్పినా మోటివేషనల్ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథని తీసుకొని ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రాన్ని తెరకెక్కించారు . అయేషా పాత్రలో జైరా కనిపించనుండగా, వయసులోని వివిధ దశలలో ప్రియాంక లుక్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది. రియల్ లైఫ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రియాంక .. సిద్ధార్ద్ రాయ్ కపూర్, ఆర్ఎస్‌వీపీతో కలిసి నిర్మించింది. ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రాలు 2005లో దిల్ దఢ్‌ఖనే దో అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాగా, ది స్కైజ్ ఈజ్ పింక్ వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులకి మంచి వినోదం అందించడం ఖాయమని మేకర్స్ అంటున్నారు.
previous article
సంక్రాంత్రి బరిలో రజిని…
next article
ఈ సినిమాలైన హిట్ ఇస్తాయేమో చూడాలి…
Related Posts
- /No Comment