పెట్రో బాంబు పేల్చిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : రోజురోజుకూ భగ్గుమంటున్న పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతో ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు అంతర్జాతీయ అంశాలే కారణమని పేర్కొన్నారు.

మరోవైపు శనివారం రికార్డు గరిష్టస్ధాయిలకు చేరిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం సైతం మరింత భారమయ్యాయి. ఇక హైదరాబాద్‌లో ఆదివారం పెట్రోల్‌ లీటర్‌కు 17 పైసలు భారమై రూ 83.59కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ 86.09కు చేరగా, డీజిల్‌ లీటర్‌కు రూ 74.76 పలికింది. అమెరికన్‌ డాలర్‌తో రూపాయి రూ. 71కి పడిపోవడంతో ఆగస్ట్‌ 16 నుంచి ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది.

Leave a Response