మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలకు ఒక క్రేజ్ ఉంది. ఆయన నటనకు సాటిలేదు ఎందుకంటే ఆయన నటించరు, జీవిస్తారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఈయన నటనకు సలామ్ కొడతారు. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కష్టాన్ని నమ్ముకున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి.తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన చిత్రాల్లో మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. ఇందులో ఆయన డ్రెస్సింగ్ స్టైల్, నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు ప్రేక్షకులను రంజింపచేశాయి. సినిమాలో మెషీన్ గన్ పట్టుకుని నిలబడే సన్నివేశం దగ్గరి నుంచీ ప్రతిదీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా గ్యాస్ లైటర్ పట్టుకుని నిలబడిన స్టిల్ ఎవర్‌గ్రీన్.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో యువ కథానాయకుడు నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నాని కూడా చిరంజీవిలా గ్యాస్‌లైటర్ పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆనాటి క్లాసిక్ గ్యాంగ్‌లీడర్‌ను గుర్తు చేసుకుంటూ అభిమానులకు మేమిస్తున్న ఘనమైన కానుక. హ్యాపీబర్త్‌డే సర్. ఎప్పటికీ మీరే మా గ్యాంగ్‌లీడర్.’ అని నాని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన ప్రతిఒక్కరు చాలా గర్వంగా ఫీలవుతున్నారు.