3,648 కిలోమీటర్లు ఈ నేల మీది నడిచినందకు, మీలో ఒకడిగా నిలిచినందుకు, ఆకాశమంత విజయాన్ని అందించిన మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెబుతున్నానని ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవిని తాను స్వీకరిస్తున్నానని తెలిపారు. పదేళ్ల తన రాజకీయ జీవితంలో పాదయాత్రలో ప్రజలందరి కష్టాలను విన్నానని, స్వయంగా చూశానని అన్నారు. కష్టాలను చూసిన తాను సీఎంగా ఒక్క మాట చెబుతున్నానని… మీ అందరికీ తాను అండగా ఉన్నానని చెబుతున్నానని భరోసా ఇచ్చారు. కేవలం రెండో రెండు పేజీలతో, ప్రజలందరికీ ఎప్పుడూ కనిపించేలా మేనిఫెస్టో రూపొందించామని… పేజీలకు పేజీల మేనిఫెస్టో తీసుకురాలేదని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా మార్చుతానని చెప్పారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చుతానని చెప్పారు. మేనిఫెస్టోనే ఊపిరిగా మీ అందరి కోసం పని చేస్తానని తెలిపారు. అందరికీ మాట ఇచ్చినట్టుగానే నవరత్నాలను నెరవేర్చుతానని చెప్పారు.
previous article
తండ్రి ఆశీస్సులతో పాలనా మొదలు పెడతాను…
next article
‘వైఎస్సార్ పెన్షన్ కానుక’పై తొలి సంతకం
Related Posts
- /No Comment
పోలీసులనే పట్టించే యాప్..?
- /No Comment