తండ్రి ఆశీస్సులతో పాలనా మొదలు పెడతాను…

విజయవాడలోని ఇందిరా మైదానంలో గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్‌.. అంతకుముందు మంగళ, బుధవారాల్లో సీమ జిల్లాల్లో పర్యటించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్న వైఎస్‌ జగన్‌.. బుధవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని.. రోడ్డుమార్గాన కడప పెద్దదర్గాకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. చాదర్‌ Image result for jaganసమర్పించి తన భక్తిని చాటుకున్నారు. భారీగా హాజరైన అభిమానులు, నాయకులకు అభివాదం తెలిపారు. పలువురిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు బయలుదేరారు. పులివెందుల చర్చిలో ప్రార్థనల అనంతరం క్రైస్తవ మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. సన్నిహితులు, బంధువులతో ముచ్చటించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ వైఎస్‌ ఘాట్‌లో తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అంజలి ఘటించారు. కొద్దిసేపు తన తండ్రి సమాధిని చేతులతో తాకి మౌనం పాటించారు. ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి సందర్శన అనంతరం వైకాపా ఎమ్మెల్యేలతో జగన్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాలతో అది రద్దయింది.

Leave a Response