కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రా ఇవాళ మహాకాలేశ్వరుడికి పూజలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగం క్షేత్రం ఉజ్జయినికి వెళ్లిన ఆమె అక్కడ మహాకాలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ కూడా ఆమె వెంట వెళ్లారు. గర్భగుడిలో ప్రియాంకా శివార్చనలు చేశారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉజ్జయిని మహాకాలేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రియాంకా రాక సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వస్తే పది రోజుల్లోనే రైతులకు రుణమాఫీ కల్పిస్తామన్నారు, కానీ ఇంతవరకు కమల్‌నాథ్ ప్రభుత్వం ఆ పనిచేయలేదని శివరాజ్ ఆరోపించారు. ఈ విషయం గురించి కమల్‌నాథ్‌ను అడగాలని ప్రియాంకాను శివరాజ్ డిమాండ్ చేశారు. రైతు రుణాలను మాఫీ చేయలేదు, సీఎం కమల్ మీ సోదరుడిని తప్పుదోవ పట్టిస్తున్నాడు, మీ సోదరుడు అబద్దాలు చెబుతున్నాడని శివరాజ్ అన్నారు.
previous article
అందుకే ముంబయి ఛాంపియన్ అయింది : ధోనీ
next article
పెళ్లి సిన్ నాకు చాలా ఇష్టం…?
Related Posts
- /No Comment
రూ.6,53,100 జరిమానా విధించిన ఒడిశా ప్రభుత్వం…!
- /No Comment