ఇంటర్ విద్యార్థుల సమస్యకి కేసీఆర్ పరిష్కారం చూపాలి: జగ్గారెడ్డి

తక్షణమే సీఎం కేసీఆర్ రంగప్రవేశం చేసి ఇంటర్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల సమాధానాలు తప్పించుకునే విధంగా ఉన్నాయన్నారు. అధికారుల నిర్లక్ష్య సమాధానంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.  అసలు దీనికంతటికీ కారకులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకొని, విద్యార్థులకు తగిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు.చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధిక సాయం అందించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

 

Leave a Response