మోదీని సైతం దిగ్భ్రాంతిలో…

Shocked by Modi ...

అనాజ్‌ మండీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృతి చెందగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.స్కూలు బ్యాగులు, బాటిళ్లు, ఇతర చిన్నచిన్న సామగ్రి తయారు చేసే కుటీర పరిశ్రమ ఈ భవనంలో ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తాం అని కేజ్రీవాల్ ప్రకటించారు. శ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదం ప్రధాని మోదీని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. ఇంకో 20 మంది భవనంలో చిక్కుకున్నారని గుర్తించిన సిబ్బంది వారిని ప్రాణాలతో రక్షించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:delhifire accidentmodi

Leave a Response