చంద్రబాబు అమరావతి యాత్ర చేపట్టారు. ఎన్నికల తర్వాత తొలి సారి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ వర్గీయులు ఆందోళనకు దిగాయి. నల్లబాడ్జీలు ధరించి చంద్రబాబు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారు. చెప్పు లు విసిరారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటాయపాలెం దగ్గర పలువురు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.తాను రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు.మొత్తానికి వెంకటయ్యపాలెం వద్ద ప్రజలు రెందు వర్గాలుగా చీలిక అయ్యారు. కొంత మంది చంద్రబాబు తమకు ఏ అన్యాయం చేయలేదని జగన్ కూడా పాలనలో బాబు లాగే అభివృద్ధి చేపట్టాలని వారి భావాలు వెల్లడించారు. మరి కొత మంది నేతలు వైసీపీ ప్రజలు రాళ్ళు రువ్వుతూ గో బ్యాక్ అని నినాదాలు చేపట్టారు. వారిని పోలీసులు మరియు రోప్ టీమ్ బృందం తిప్పి పంపించారు. దీని పై టిడిపి కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల తర్వాత తొలి సారి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలనూ చంద్రబాబు పరిశీలించనున్నారు. మరోవైపు అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. బాబు అమారావతిలో ఆయన హయాంలో చేపట్టిన పనులు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి అని చూసి జగన్ సర్కార్ ను నిలదీయటానికి ఈ పర్యటణ చేపట్టినట్లు సమాచార. తాను రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు.