ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు బయటకు వచ్చేందుకు కూడా మొహమాటపడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేల జాడ అంతగా కనిపించడం లేదు.ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ పార్టీ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గెలిచిన వారిలో బొత్స, రాజన్నదొర వంటి సీనియర్లు కొందరైతే అలజంగి జోగారావు , శ్రీనివాసరావుల వంటి జూనియర్లు ఉన్నారు. కొన్నాళ్ళపాటు విజయోత్సాహంతో నియోజకవర్గాల్లో బాగానే తిరిగారు. తమ వద్దకు వచ్చి పోయె అనుచరులు, అభిమానుల సందడి తో వారి ఇల్లు కళకళలాడుతుండేవి. ప్రస్తతం తాము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎదురుగా కనిపించిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇక జాబులు పోస్టింగులు అన్ని అధికారుల కనుసన్నల్లోనే జరుగుతాయి. ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లక పోవడంతో వీరితో పనేముంది అంటూ తప్పించుకుంటున్నారు.