గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీ లో చేరుతారు అంటూ వస్తున్న వార్తలు స్థానిక వైసీపీ నాయకుల్లో తీవ్ర అలజడికి దారితీశాయి. నాటి పరిణామాలకు కొనసాగింపుగా వంశీ తెలుగు దేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు లేఖ రాయడం, ఆ లేఖకి వంశీ సమాధానం ఇవ్వడం వంటి అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. వంశీ కారణంగా టిడిపి హయాంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు అతనే పార్టీ లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని యార్లగడ్డ ఆందోళన చెందుతున్నారు.ఈ కోణంలోనే ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య మంత్రి జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం అయితే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సి.ఎం జగన్ మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం తరువాత గన్నవరం వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు రెండు రెండున్నర ఆ ప్రాంతంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దింతో కృష్ణాజిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.