కిలో ఉల్లిపాయలు కొనే వినియోగదారుడు ఇప్పుడు కేవలం పావు కిలోతో సరిపెట్టుకుంటున్న దుస్థితి వచ్చింది.ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు పక్కన నగదు పెట్టెలు ఉన్నప్పటికీ వాటిని కనీసం తాకకుండా కేవలం ఉల్లిపాయలను మాత్రం దొంగతనం చేస్తున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో దుండగులు 40 టన్నుల ఉల్లిపాయలు ఉన్న ట్రక్కును దొంగిలించారు. వాటి విలువ సుమారు 22 లక్షల వరకు ఉంటుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. డిసెంబరు మొదటి వారం లోపు దేశానికి సరుకు చేరుకుంటుంది అంటున్నారు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్. చివరకు ఉల్లి దొంగతనాలు చేసే వరకూ పరిస్థితి వెళ్లింది.డబ్బులు, బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులు చోరీ కావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు వాటి జాబితాలో ఉల్లిపాయలు కూడా చేరాయి. ఉల్లి ధరల అదుపునకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది అన్నారు.