తాను ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ హామీగానే భావించి..అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ శాఖల అధిపతులకు కార్యదర్శులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన విధానంపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు.ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావటమే మైలురాయిగా పనిచేయాలని.. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చినపుడే అది సాధ్యమవుతుందన్నారు. నవరత్నాల అమలే ఫోకస్ గా ఉండాలని వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా సంతృప్త స్థాయిలో చేస్తుందనేది ప్రజల్లో చర్చ కావాలన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలం ఆలోచనల చెయ్యాలని ఆదేశించారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకోవాలన్నారు. చ్చబండ సమయంలో ప్రజల నుంచి వచ్చే వినతులపై హామీలిస్తాం వాటన్నింటిని అమలుచేయటంపై అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి హామీ అమలు కావాలి పనులు వెనువెంటనే మొదలుకావాల్సిందే.. మాట ఇస్తే అమలుచేయాల్సిందే.. తాత్సారం జరగకూడదు, ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదు. రచ్చబండ కోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సెలవిచ్చారు.