రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద సినిమాలతో అందరికీ షాకులిచ్చే దర్శకుడు. తాజాగా వర్మ చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా నవంబర్ 29 న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంతవరుకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. సినిమా టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. వర్మ ఈ సినిమా టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చాలని డిసైడ్ అయ్యారు. సినిమాకు సెన్సార్ చేయకుండా, సెర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపడంతో.. నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. వారంలోగా సినిమా చూడాలని సెన్సార్బోర్డును ఆదేశించింది. అలాగే ఈ సినిమాపై వచ్చిన అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ సినిమా టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చు రగిల్చేలా ఉంది. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చిన విషయాన్ని సెన్సార్ బోర్డు కు తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ బోర్డు పై ఆధారితం అయింది.