480 ఎకరాల్లో ఐటీ హబ్..!

దివిటిపల్లి సమీపంలో సేకరించిన 480 ఎకరాల భూమిలో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ టవర్ పనులకు తొలి అడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా 25 కోట్ల నిధులు విడుదల చేయడంతో టీఎస్ ఐఐసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పూర్తిగా 5 అంతస్థుల్లో నిర్మించే ఈ టవర్ లో ప్రస్తుతానికి జీ ప్లస్ టు నిర్మాణాన్ని చేపడతారు. అందులో దాదాపు 50,000 అడుగుల విస్తీర్ణంలో స్పేస్ ను కంపెనీలకు అప్పగిస్తారు. ఆ స్పేస్ లో కంపెనీలు.. ఇంక్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. తదనంతరం అవే కంపెనీలకు వారు అడిగినంత మేరకు స్థలాన్ని కేటాయించి కంపెనీల నిర్మాణాన్ని రెండో దశలో చేపడతారు. ముఖ్యంగా ఈ కారిడార్ లో సాఫ్ట్ వేర్ ఆధారిత కంపెనీలతో పాటుగా ఐటి, కంప్యూటర్ హార్డ్ వేర్, కాలుష్య, రసాయన రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు.గత ఏడాది మార్చి 14 న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి అంచున నిలుపుతామని ప్రకటించారు. కానీ ఎన్నికల కారణాల వల్ల జాప్యం జరిగింది. సుదీర్ఘ జాప్యం తర్వాత తొలి అడుగుకు అంతా సిద్ధం చేశారు. ఐటీ కారిడార్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న ప్రతిభావంతులైన యువతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఐటీ టవర్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సాఫ్ట్ వేర్ మరియు పారిశ్రామికంగా అభివృద్ధి జరగటం జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు.

Tags:it hub

Leave a Response