టిక్ టాక్ లో ఐసిస్..!

ఐసిస్ వీడియోలు ఎక్కువగా ముగ్గురు యూజర్ల నుంచి పోస్టు అవుతున్నాయని గుర్తించారు. వారిలో ఒకరు మహిళ అని తెలుస్తోంది. ఈ హింసాత్మక ఘటనలున్న వీడియోలకు లైకులు కూడా రావడం టిక్ టాక్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు ఇలాంటి అభ్యంతరకర వీడియోలను తొలగిస్తోంది.కరడుగట్టిన ఉగ్రవాద భావజాలంతో మధ్యప్రాచ్యంలో నెత్తుటేర్లు పారిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వీడియో అప్ లోడింగ్ యాప్ టిక్ టాక్ లో కూడా ఐసిస్ వీడియోలు పోస్టు అవుతుండడమే అందుకు నిదర్శనం. తమ వద్ద ఉన్న బందీలను గొంతు కోసి చంపడం, వారిని హింసించడం తాలూకు వీడియోలు తరచుగా టిక్ టాక్ లో దర్శనమిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం చర్యలు తీసుకుంది.

Tags:isistiktok

Leave a Response