సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రేపటితో ముగియడంతో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చనే అంచనాలతో… జాతీయ పార్టీల నేతలు తమ మిత్రపక్షాలతో సమాలోచనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో, నిన్ననే ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కాసేపటి క్రితం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇరువురు నేతలు పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
మరోవైపు ఈ మధ్యాహ్నం చంద్రబాబు లక్నో వెళ్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఆయన భేటీ అవుతారు. భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు.