మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుండి కర్నూలులో పర్యటన చేయనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టిడిపి నేతలు ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జిల్లాలోనే ఉండి చేసి పార్టీ పరిస్థితిని విక్షించనున్నారు. పార్టీ బలోపేతానికి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్ నందికొట్కూరు, నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి సమీక్షించనున్నారు. ఆళ్ళగడ్డ కోడుమూరు నియోజక వర్గాల నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. మూడో రోజు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం నియోజక వర్గాల పై సమీక్ష నిర్వహించటానికి బాబు సిద్ధమయ్యారు. మూడు రోజుల పర్యటన పై ఇప్పటికే పార్టీ శ్రేణులు కార్యక్రమాలను సిద్ధం చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇతర నాయకుల ఆధ్వర్యంలో టోల్ గేట్ నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీతో ఆహ్వానం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.