‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆ సినిమా టైటిల్. ఒక కులాన్ని తక్కువచేసి, ఇంకో కులాన్ని ఎక్కువచేసి చెబుతున్నట్లుగా టైటిల్లో అర్థం రావడంతో సహజంగానే ఒక కులంవారు ఆ టైటిల్పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ టైటిల్ వల్ల ఆ అర్థం వస్తుందనే విషయం తనకసలు తెలీదన్నట్లుగా వర్మ అమాయకత్వాన్ని చూపించారు.తాజాగా ఆయన ట్విట్ ల వర్షం కురిపించారు. దింతో కొందరు సమర్దిస్తే మరికొందరు దుమ్ము ఎత్తి పోస్తున్నారు. తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని లక్షీపార్వతి దృష్టి నుంచి తీశానని, అదే విదంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా తీశానని అన్నారు. ఎవరి నుంచి ఎన్ని అభ్యంతరాలొచ్చినా, తనకు తోచింది తియ్యడం ఆయన సహజ గుణం కాబట్టి, కాంట్రవర్సీతో ప్రచారాన్నీ, తద్వారా డబ్బునూ సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఆయన ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు, ఆయన మాటలు, చేష్టలు సరదాగా ఉంటున్నాయి కాబట్టి జనం కూడా వాటిని ఆస్వాదిస్తున్నట్లే కనిపిస్తోంది. నవంబర్ 29న సినిమాని విడుదల చెయ్యడానికి ఆయన చేసుకున్న ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. దీంతో ఒక మెట్టు దిగారు వర్మ. టైటిల్ను ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అని మార్చిన సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
Tags:ram gopal varmargv
previous article
అది చేసినప్పుడు నా ఫీలింగ్….
next article
నానికి జోడిగా ‘కౌసల్య’