ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ ట్వీట్లతో తెలుగుదేశం, వైసీపీల పై యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఎకౌంట్ లో చేసిన ట్వీట్లు కనిపించడం లేదు అంటు జనాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. నెలల కాలంలో అసలు పవన్ ట్వీట్లే చెయ్యలేదా ఏంటి ? మరి సడన్గా 4 నెలలపాటు ఆయన ట్విట్ లు కనిపించకపోవటంతో అసలు ఏం జరిగిందా అని వైసీపీతో పాటు ఆయనను ఫాలో అవుతున్నవారు ఆలోచనలో పడ్డారు. వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీతో కలిసి వైసీపీ సర్కారుపై పోరాడాలని నిర్ణయించుకున్నారని, ఏపీ మొత్తంగా గుసగుసలు ఆడుతుంది. ఆ సమయంలో ఎన్నికల హడావుడిలో ఉన్నందున అసలు ట్వీట్లు ఏమీ చెయ్యలేదని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.ట్వీట్లను తొలగించాల్సిన అవసరం లేదని, పవర్ స్టార్ కు అలాంటి భయాలు ఏమి లేవని చెబుతున్నాయి. ఏదైనా నిర్భయంగా మాట్లాడ్డమే తమ అధినేత నైజమని చెప్పుకొంటున్నాయి. ఆ కాలంలో పార్టీ ఐడీ నుంచి తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అకౌంట్ నుంచి ట్వీట్ లేవీ చెయ్యలేదని వాదిస్తున్నాయి.
previous article
ఎమ్మెల్యేల జాడ ఎక్కడ…
next article
మరో దారుణం…