నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. విష్వక్సేన్ ను కథానాయకుడిగా, రుహాని శర్మను నాయికగా ఎంపిక చేసుకున్న ఆయన, ఈ సినిమాకి ‘హిట్’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరిస్తున్న ఈ సినిమాతో, దర్శకుడిగా శైలేశ్ పరిచయం అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని ‘వి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఒక వైపున కథానాయకుడిగా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న నాని, నిర్మాతగా కూడా విభిన్నమైన కథలనే ఎంచుకుంటున్నాడు. కంటెంట్ లో కొత్తదనం వుంటే చాలు తన బడ్జెట్ పరిథిలోని నటీనటులతో సినిమాలను నిర్మిస్తున్నాడు. అలా ఆ మధ్య ‘అ’ సినిమా చేసిన ఆయన, తాజాగా మరో సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగాడు.
Tags:naninani as producernew movie
previous article
ఉయ్యాలవాడ మనసులో ఏముంది?
next article
టి20 సిరీస్ కు భారత జట్టు..!
Related Posts
- /No Comment