‘ది ఫ్యామిలీ మాన్: సీజన్ 2’ వెబ్ సిరీస్లో తాను నటిస్తున్నట్టు అక్కినేని సమంత కన్ఫర్మ్ చేసింది. సమంత నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇది. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్, కిషోర్ తదితరులు నటించిన ‘ది ఫ్యామిలీ మాన్’ నెటిజన్లను బాగా అలరించింది. ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు.’ది ఫ్యామిలీ మాన్’ ఫస్ట్ సీజన్ సమంతకు బాగా నచ్చింది. కొన్ని రోజులకు ‘ది ఫ్యామిలీ మాన్’ సెకండ్ సీజన్ లో సమంత నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా దీనిపై సమంత ఈ ఈ వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తునట్టు సమాచారం. దాంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గురువారం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. “యస్! ఫైనల్లీ… మై వెబ్ సిరీస్ డెబ్యూ” అని సోషల్ మీడియాలో సమంత షేర్ చేశారు.ప్రస్తుతం ’96’ తెలుగు రీమేక్ తో బిజీగా ఉన్నారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.