‘చిత్రలహరి’ టీజర్ సూపర్ అంట..! Sai dharama tej new movie ‘Chitralahari’ teaser

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ సినిమా నుండి కాసేపటి క్రితం టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ‘చిత్రలహరి.. అప్పట్లో దూరదర్శన్ లో ప్రతి ఫ్రైడే వచ్చే ఓ ప్రోగ్రామ్.. ఈ చిత్రలహరి.. 2019 లో ఓ ఫ్రైడే రిలీజ్ అవబోయే సినిమా. అందులో కొన్ని పాటలు, ఇందులో కొన్ని పాత్రలు’ అంటూ టీజర్ మొదలవుతుంది.  కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన క‌థానాయిక‌లుగా కల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేద పేతురాజ్‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న‌ విడుదల అవుతుంది.

 

 

Leave a Response