మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ సినిమా నుండి కాసేపటి క్రితం టీజర్ ని విడుదల చేశారు. ‘చిత్రలహరి.. అప్పట్లో దూరదర్శన్ లో ప్రతి ఫ్రైడే వచ్చే ఓ ప్రోగ్రామ్.. ఈ చిత్రలహరి.. 2019 లో ఓ ఫ్రైడే రిలీజ్ అవబోయే సినిమా. అందులో కొన్ని పాటలు, ఇందులో కొన్ని పాత్రలు’ అంటూ టీజర్ మొదలవుతుంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కథానాయికలుగా కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల అవుతుంది.