ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితులు తెలిపారు.తమ హీరో హీరోహిన్స్ పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతుంటాయి. కొత్త చిత్రాల ముచ్చట్లు, టీజర్లు, ఫస్ట్లుక్కులూ వరుస కడుతుంటాయి. అందుకే స్టార్ కథానాయకుల పుట్టిరోజు కోసం చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. మరి ప్రతిసారీ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా చేస్తుంటారు. ఈ సారి తమ అభిమానులకు నిరాశ తప్పదా లేదా అభిమానులకు ఆర్ ఆర్ ఆర్ లో లుక్ ను విడుదల చేసి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అనేది చూద్దాం.