ఎగనెస్ట్‌గా తియ్యడం నా ఉద్దేశం కాదు…

రాంగోపాల్ వర్మ చేసిన ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి కారణం టైటిల్‌కు సెన్సార్ బోర్డు అనుమంతించకపోవడం. దాంతో ఆ సినిమా టైటిల్ మార్చేశాడు వర్మ. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వర్మ, పొలిటీషియన్స్‌ను చూసి తాను నేర్చుకున్న దాని ప్రకారం ఈ సినిమా తీశానని అన్నారు. ఒకరికి ఫేవర్‌గా, ఇంకొకరికి వ్యతిరేకంగా సినిమా తియ్యలేదు అన్నారు. “బేసిగ్గా ఒకరి మనోభావాలు దెబ్బతిన్నప్పుడే మనకు వాక్ స్వాతంత్ర్యం అవసరం.నేనెప్పుడూ ఒకర్ని ప్రేమించడానిక్కానీ, ద్వేషించడానిక్కానీ టైం వేస్ట్ చెయ్యను. పొలిటికల్ సెటైర్ తియ్యడానికి నేను చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఒకరికి ఫేవర్ చెయ్యడం, ఇంకొకరికి ఎగనెస్ట్‌గా తియ్యడం నా ఉద్దేశం కాదు. ట్రైలర్ రిలీజైనప్పుడు అందరూ ఇదొక ఫన్ ఫిల్మ్ అనీ, సెటైరికల్ వేలో ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నట్లు ఉంది అనీ ఫిక్సయ్యారు. రిలీజ్ చేసిన పాటల్లోనూ అదే మెసేజ్ ఉంది. దేన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనేది ఈ సినిమాతో నేనిస్తున్న మెసేజ్” అని అన్నారు.

Tags:kamma rajyamlo kadapa reddlu

Leave a Response