విజయ్ దేవరకొండ ‘హీరో’ అయ్యాడు.. కన్ఫర్మ్

ర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా అందించిన విజయంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అనే తేడాలేకుండా అంతా ఈ యువ హీరోకి ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో అమాంతం క్రేజ్ పెంచేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో సినిమాకు సైన్ చేశాడు విజయ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 9గా ఈ సినిమా రూపొందనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది చిత్రయూనిట్. చిత్రాన్ని ఏప్రిల్ 22 నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే నటించనుందని టాక్ వినిపిస్తోంది.

Leave a Response