‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ మారింది

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని ఈ సినిమా ద్వారా బయటపెట్టనున్నానని వర్మ ప్రకటిస్తుండటంతో సినీ, రాజకీయ వర్గాల్లో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా అప్‌డేట్స్ ద్వారా సంచలనం సృష్టించిన వర్మ.. మొదట ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.అయితే ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో సినిమాను విడుదల చేయకూడదని కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.. ఆ డేట్‌లో సినిమా విడుదలను ఆపేయాలని సెన్సార్ బోర్డు వారు ఆదేశించడం జరిగింది. దీంతో ఈ విషయమై సెన్సార్ బోర్డు వారితో పలు చర్చలు జరిపిన వర్మ.. ఎట్టకేలకు చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేశారు వర్మ. అతిత్వరలో సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుపుతామని ఈ సందర్బంగా వర్మ చెప్పారు.

Leave a Response