టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత బోయపాటి ఒక పవర్ఫుల్ కథపై కసరత్తు చేస్తూ వున్నాడు. ఈ నెలలోనే బాలకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో రోజా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా పాత్రల ఎంపికపై బోయపాటి దృష్టిపెట్టినట్టుగా చెబుతున్నారు.ఈ సినిమాలో కామెడీకి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం, ‘జబర్దస్త్’ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి వున్నాడని అంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు.
previous article
నిందితుల్ని వెంటనే ఉరితీయాలి….
next article
కర్నూలులో బాబు పర్యటన…
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment