ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యలు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను ఆశ్చర్యపరిచారట. పగలబడి నవ్వించారట. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అందరికి వెల్లడించాడు. ఈ ఇద్దరు పిల్లలతో కలిసి చాలా విలువైన సమయాన్ని గడిపానని అన్నాడు. తన కంపోజిషన్ సెషన్ లో క్యూట్ అతిథులుగా సితార, ఆద్య పాల్గొన్నారని, వాళ్లను ఇంప్రెస్ చేసేందుకు తాను గిటారుకు పని చెప్పానని అన్నాడు. అయితే, అదేమీ అంత సులభం కాలేదని, వాళ్లు మాత్రం తమ ముద్దు ముద్దు మాటలతో చాలా నవ్వించారని చెప్పాడు. ఇంతలా తాను ఎన్నడూ నవ్వలేదని అన్నాడు. చాలా గొప్ప సమయం. లవ్ యూ కిడ్స్… అంటూ దేవిశ్రీ సదరు ఫోటోలను షేర్ చేసుకోగా, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేవిశ్రీ గిటార్ వాయిస్తుంటే సితార, ఆద్యలు పగలబడి నవ్వుతున్నట్టు ఈ చిత్రాల్లో కనిపిస్తోంది.
next article
‘కాంచన 3’ రిలీజ్ డేట్…?
Related Posts
- /No Comment
టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి..!
- /No Comment