బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అటు వెండితెర మీద ఇటు బుల్లితెర మీద ప్రేక్షకులని చాలా బాగా అలరించాడు. సల్మాన్ ఖాన్ ఎన్నో సినిమాలో కధానాయకుడిగా నటించాడు. అందులో హిట్ ఇచ్చిన జాబితాలో ‘దబాంగ్’ ఒకటి. తాను చేసిన ‘దబాంగ్’,’దబాంగ్-2′ సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సిరీస్ లో మూడో భాగం అంటే ‘దబాంగ్-3’ రానుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో సల్మాన్ తో జోడిగా మమతా శర్మ నటించింది. ‘మున్నా బద్మామ్ హువా’ అంటూ సాగే ఈ పాటను నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పటికే కోటి వ్యూస్ సాధించింది. దింతో ప్రస్తుతం ఈ పాట టాప్ కి వెళ్లిపోయింది. ఇక ఇదే సిరీస్ ను మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక మూడో భాగం పవన్ చేస్తారో లేదో వేచి చూడాలి.