గోపీచంద్ చేతుల మీదుగా ‘జైసేన’ టీజర్…

సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక.లోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పోలీస్ పాత్రలో దర్శకుడు వి. సముద్ర తెరకెక్కిస్తున్న సినిమా ‘జైసేన’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ సమక్షంలో హీరో గోపీచంద్ విడుదల చేశారు. పోలీస్ ఆఫీసర్ ‘దేవదాస్’గా సునీల్ పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్‌లో సునీల్ యాక్షన్, కామెడీ సన్నివేశాలు, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజయలక్ష్మి సమర్పణలో శివ మహా తేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్‌ కుమార్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌కు అభిమానులను నుంచి విశేష స్పందన లభించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ రాజకీయ ఆశయాలకు సంబంధించినదైతే, తమ సినిమా ‘జైసేన’ ఆయన భావాలకు సంబంధించినదని గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించిని విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సునీల్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని టాలీవుడ్ లో అంత అంటున్నారు.

Leave a Response