‘ముని’ సిరీస్‌లో నాలుగో భాగంగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రం ‘కాంచన3’ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నృత్య‘దర్శకుడు’, నటుడు రాఘవ లారెన్స్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రంలోనూ వైవిధ్యమైన కథను అందించబోతున్నారు. ఇంతకుముందు వచ్చిన మూడు భాగాలను మించి భారీగాను ఉండబోఓందని యూనిట్ సభ్యుల సమాచారం. లారెన్స్‌కు జోడీగా వేదిక, తాజా సంచలనం ఓవియా నటించారు. సీనియర్ హాస్యనటి కోవై సరళ నాలుగో భాగంలోను తన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధంగా వున్నారు. ఇంకా నిక్కీ తంబోలి, శ్రీమాన్, దేవదర్శిని తదితరులు నటించారు. కాగా, ‘కాంచన2’ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ‘కాంచన3’ విడుదలయ్యాక లారెన్స్ తొలి హిందీ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుంది అన్ని సమాచారం.