అఖిల్ అక్కినేని కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుతం కథా నాయిక ఎంపికపై చిత్రబృందం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. కియారా అడ్వాణీని చిత్రబృందం సంప్రదించిందట. చిత్ర వర్గాలు ఆ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. కథానాయిక ఎంపిక పూర్తి కాగానే చిత్రాన్ని మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత అఖిల్ చేస్తున్న ఈ చిత్రం కుటుంబం నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథతో తెరకెక్కనుందట.
previous article
రామ్‌చరణ్‌కు జపాన్ నుంచి సర్ప్రైజ్..!
next article
మరో ప్రయోగం చేస్తున్నాడా?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment