మరో ప్రయోగం చేస్తున్నాడా?

కమర్షియల్‌ చిత్రాలకు చిరునామాగా నిలిచే కథానాయకుడు రవితేజ. అయితే వీలున్నప్పుడల్లా కొత్త తరహా పాత్రల కోసం ప్రయోగాలు చేస్తుంటాడు. ఈమధ్యే ‘రాజా ది గ్రేట్‌’లో అంధుడిగా నటించాడు. ‘డిస్కోరాజా’లోనూ ఓ విభిన్నమైన ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇందులో రవితేజ పాత్రలో రెండు విభిన్నమైన ఛాయలు కనిపిస్తాయని సమాచారం. కథానాయకుడి పాత్రకు ఓ డిజార్డర్‌ ఆపాదించి, దాని చుట్టూ కథ నడిపించడం ఈతరం దర్శకుల కాన్సెప్ట్‌. ఈ కథలో రవితేజ కొన్ని కీలకమైన సందర్భాల్లో బిగుసుకుపోతాడట. ఆ సమస్య చుట్టూనే ‘డిస్కోరాజా’ కథ నడుస్తుందని, దాని చుట్టూ వినోదం, యాక్షన్‌,  భావోద్వేగాలూ పండించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో ‘డిస్కోరాజా’ సెట్స్‌పైకి వెళ్ల బోతోంది.

Leave a Response