ఇటీవలే ఒక్కటైన సినీ ప్రేమజంట ఆర్య, సాయేషా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారట. అయితే అది నిజంగా కాదులెండి, వారిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త చిత్రంలో పెళ్లి సన్నివేశం ఒకటి వుందట. ఆర్య, సాయేషా పెళ్లి దృశ్యాలు త్వరలో చిత్రీకరించనున్నా రని తెలుస్తోంది. ఇంతకీ ఆ చిత్రం పేరు.. ‘టెడ్డీ’. స్టూడియోగ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞాన వేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తుండగా, డి.ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్య – సాయే షాల పెళ్లి రోజునే ప్రకటించడం విశేషం. చెన్నై, యూరప్‌లో చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారు. యూత్‌తో పాటు పిల్లలు మెచ్చే అంశాలు ‘టెడ్డీ’లో అధికంగా వుంటాయని చిత్ర యూనిట్ తెలిపేరు.