ఒక రాయి వేస్తే మేం తోపులు అనుకుంటారు..!

అలీ ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ లో నటించిన ‘రాజుగారి గది 3’ రీసెంట్ గా విడుదలైంది. రివ్యూ రైట్లర్లు సినిమాకు గొప్ప రేటింగులు ఇవ్వలేదు. దాంతో అలీగారికి కోపం వచ్చింది. ‘కొంతమంది పనిగట్టుకుని సినిమా బాలేదంటున్నారు. ఏదో అనుకున్నాం. ఏదో ఎక్స్ పెక్ట్ చేశాం. మీరెవరు చెప్పడానికి? కొంకిస్కా గొట్టంగాళ్ళు. చెప్పాల్సింది ప్రేక్షక దేవుళ్ళు. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్లి ఎక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టకూడదు అనేది తెలుసు. ప్రేక్షకులను నమ్ముకుని సినిమాలు తీశాం. ఇండస్ట్రీకి వచ్చాం. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళను నమ్ముకుని ఇండస్ట్రీకి రాలేదు. అలా ఒక రాయి వేస్తే మేం తోపులు అనుకుంటారు. మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. ఆ విషయంలో ‘రాజుగారి గది 3′ సమాధానం చెప్పింది” అని అలీ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడారు. కొంకిస్కా గొట్టంగాళ్ళు, మూర్ఖులు అని రివ్యూ రైటర్లపై నోటిదురుసు చూపించడం అవసరమా? అది సంస్కారమా? అలీ విజ్ఞతకు వదిలేయడం మంచిది.’మనం బావున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్’ – ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో త్రివిక్రమ్ రాసిన డైలాగ్. దీన్ని అలీగారికి ఒకసారి ఎవరైనా గుర్తుచేస్తే బావుంటుందేమో. అలీకి మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు అందరికీ. ఎందుకంటే… సినిమాలకు మంచి రివ్యూలు వచ్చినప్పుడు సంతోషించే టాలీవుడ్ జనాలు, రివ్యూలు బ్యాడ్ గా వస్తే అసలు తట్టుకోలేకపోతున్నారు. రివ్యూ రైటర్ల మీద విరుచుకుపడుతున్నారు. తాము ఏదో గొప్ప సినిమా తీసినట్టు, రివ్యూల వల్ల దాన్ని ఎవరూ చూడటం లేదన్నట్టు మాట్లాడుతున్నారు.

Tags:aliraju gari gadi 3

Leave a Response