సౌతాంప్టన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్2019లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్స్ తేడాతో టీమిండియా గెలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తోలి మ్యాచ్ లో తొలి శతకం కావడం విశేషం. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 128 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో రోహిత్ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ క్యాచ్ వదిలిన క్యాచ్ రోహిత్ బాగా వినియోగించు కున్నాడు అని చెప్పొచ్చు . బంతి గ్లౌవ్స్‌కు తాకి గాల్లోకి లేచింది, అయితే ఆ క్యాచ్‌ను డుప్లెసిస్ వదిలేయడంతో రోహిత్ ఊపిరి పీల్చుకున్నాడు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధావన్(8) నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాధసారథి విరాట్ కోహ్లి(18) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవటం అభిమానులకు చాల నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. దీంతో 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీం ఇండియా. ఈ తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ బాగా చక్కదిడ్డి పరుగుల వర్షం కురిపించాడు అనిపించింది. వీర్దిద్దరూ మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించిన అనంతరం రాహుల్(26)ను రబాడ బొల్తా కొట్టించాడు. అయితే రోహిత్ మాత్రం తనదైన రీతిలో వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. రోహిత్ శతకంతో ఇండియా కతాలో ఒక విజయం నమోదు చేసుకుంది.