వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డిని నలుగురు పోకిరీలు దారుణంగా అత్యాచారం చేసి, దహనం చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక అంత్యక్రియల విషయంపై ఆమె బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. పెళ్లి కాని వారు చనిపోతే తమ కులంలో దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం తమ ఆచారమని, కానీ, ప్రియాంక పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో జరిపించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో మహిళల రక్షణకు కఠినతర చట్టాలు తెచ్చినప్పటికీ వాటిని నిరోధించలేకపోతున్నారని అన్నారు. ఈ లోపాలను సరిచేసి, దేశంలో అమ్మాయిలకు భద్రత ఉంటుందని తెలిసేలా చేయాలని ఆయన కోరారు. ప్రియాంక రెడ్డి ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదని, తాపం కూడా తెలియజేయలేదని ఆయన వాపోయారు. ప్రియాంకకు జంతువులంటే చాలా ఇష్టమని, అందుకే వెటర్నరీ వైద్యురాలయిందని చెప్పారు. ఆమెకు ఆన్‌లైన్‌లో కొత్త వంటకాలను చేయడం వంటి అలవాట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
previous article
నానికి జోడిగా ‘కౌసల్య’
next article
ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యరు…
Related Posts
- /
- /No Comment
కియా క్రెడిట్ కొట్టేయడానికి ఆరాట పడుతున్నా వైసీపీ…
- /
- /No Comment