దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా ఒక ప్రముఖ భారతీయ బహుభాషా నటుడు. ఇతను ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు.ఓ జానపద కథతో రెండు భాగాలుగా రూపొందించబడిన “బాహుబలి” క్రమంలో మొదటి భాగంగా “బాహుబలి – ద బిగినింగ్” సినిమా 2015వ సంవత్సరం జూలై 10వ తేదీన విడుదలయింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించగా, కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించడం జరిగింది. హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను అనువదించి విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది. ఇల్లాంటి సినిమా తర్వాత రానా హీరోగాగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో రానా సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకనిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఇక వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
