సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వెళితే.. రూ.లక్ష బిల్లు వేశారని కథానాయిక ఐశ్వర్య రాజేశ్ అన్నారు. ఆమె తమిళంలో నటించిన సినిమా ‘మేయ్’. నిక్కీ సుదర్శన్ కథానాయకుడు. ఎస్.ఎ. భాస్కరన్ దర్శకత్వం వహించారు. వైద్య వృత్తిలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో సాగే చిత్రమిది. తాజాగా నిర్వహించిన ఈ సినిమా విలేకరుల సమావేశంలో ఐశ్వర్య అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల నాకు సాధారణ జ్వరం వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. వైద్యులు ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి, నన్ను వార్డులో చేర్చారు. తర్వాతి రోజు నన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయమని అడిగా. ఆదివారం డిశ్చార్జ్ చేయమని వైద్యులు అన్నారు. నాకు కోపం వచ్చింది. కేవలం కొన్ని పరీక్షలు చేసినందుకు రూ.లక్ష బిల్లు వేశారు. దాన్ని చూసి షాక్ అయ్యా. మరోదారిలేక బిల్లు కట్టాను. జ్వరం తగ్గడానికి సాధారణంగా వాడే డోలో మాత్రలు ఇచ్చి పంపారు’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.ఐశ్వర్య కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె తెలుగులో నేరుగా నటించిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ హీరో శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐశ్వర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 14 సినిమాలు ఉన్నాయి.
previous article
మెగాస్టార్ పుట్టిన రోజికి, మాజీ మంత్రి శుభాకాంక్షలు..?
next article
విశాల్ వివాహానికి విరామం..?
Related Posts
- /No Comment
జాక్ పాట్ రిలీజ్ డేట్ ఖరారు…
- /No Comment